పంచామృత అభిషేకం చేస్తున్న చిన్న బాలకృష్ణ విగ్రహంతో, కృష్ణాష్టమి వ్రతం ఉత్సాహంగా జరుపుతున్న వాణి

కృష్ణాష్టమి వ్రతం పూర్తి విధానం: దశలవారీ మార్గదర్శకంతో

కృష్ణాష్టమి (శ్రీ కృష్ణ జన్మాష్టమి) శ్రీ కృష్ణుడి జన్మదినంగా భావించి అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ. ఈ రోజున భక్తులు భకి శద్ధతో ఉపవాసం పాటించి, అర్థరాత్రి దాక పూజలు చేసి, శ్రీకృష్ణుడి జన్మ ఘట్టాన్ని ప్రధాన కార్యక్రమాలు జాపుకుంటారు. పూజలో సమయంలో వెన్న, తులసి దళం, పండ్లు, మకరందం వంటివి ఉపయోగించి కృష్ణుడికి నైవేద్యం భక్తితో స్మరించుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున చిన్నారులు కృష్ణ వేషధారణలో పాల్గొనడం, కోలాటాలు, భజనలు చేయడం ఈ పండుగకూ ప్రత్యేక ఆకర్షణ చేస్తుంది. ఈ ముఖ్యమైన వ్రతం ద్వారా భక్తులకు పుణ్యం కలుగుతుందని, జీవితం ధార్మిక మార్గంలో ఉండవచ్చని నమ్మకం ఉంది.

1.కృష్ణాష్టమి వ్రతం ముఖ్యం

కృష్ణాష్టమి అనేది భారత దేశంలో శ్రీ కృష్ణ జన్మదినోత్సవంగా ప్రతి సంవత్సర మే ఆగస్టు లేదా జూలై నెలలో శ్రావణ మాసంలో నిర్వహించే ఒక పవిత్ర వ్రతంగా భావిస్తారు. ఈ వ్రతం శ్రీ కృష్ణుడి జన్మాన్ని సంతోషంగా జరుపుకునే ముఖ్యమైన దినంగా భావించబడుతుంది. ప్రతి భక్తులు ఈ రోజున ఉపవాసాలు చేసి, ప్రత్యేక భక్తి శుద్ధ తో పూజా విధానాలు శ్రీ కృష్ణుడు   కృప పొందడానికి అందరు ప్రయత్నిస్తారు.

2. వ్రతం ప్రారంభం

కృష్ణాష్టమి వ్రతం ముఖ్యంగా ఆగస్టు నెలలో, అష్టమి తిథి రాత్రి నుండి ప్రారంభం అవుతుంది. ఉదయం లేవగానే తొలుత శుభ్రంగా స్నానం చేసి, భక్తులు శుభ వస్ర్తాలు ధరిస్తారు. ఈ రాత్రి 12 గంటలకు (అష్టమి నక్షత్ర సమయంలో) ప్రత్యేకంగా కృష్ణుడి పూజలు మొదలవుతాయి.

3. పూజా విధానం

ఈ కృష్ణాష్టమి రోజున భక్తులు పూజా స్థలంలో శ్రీ కృష్ణుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించి ప్రతిష్టిస్తారు. ఆయనకు పంచామృతంతో అభిషేకం చేసి పూలతో అలంకరిస్తారు. ఈ పూజ సమయంలో భక్తిగీతాలు, శ్లోకాలతో పరవశింపజేస్తారు. మంత్రాలతో పాటు భక్తి గీతాలు వినడం పాడటం ద్వారా పూజ మరింత పవిత్రంగా మారుతుంది అని నమ్మకం. 

4. ఉపవాసం మరియు విరామం

భక్తులు భక్తితో ఉపవాసం రోజంతా పాటించడం ద్వారా శరీరం, మనస్సు శుద్ధి చందుతాయి అని భావిస్తారు. ఈ రోజు భక్తులు రాత్రి అష్టమి ముగిసిన తర్వాతనే విరామం తీసుకుంటారు. ఇది చేయడం వాలా శ్రమను తట్టుకునే శక్తిని ఇస్తుంది.

5. వ్రత విశేషాలు

ఈ దినంలో వ్రతాన్ని ఆచరించడం వల్ల కృష్ణ భక్తులకు శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. దీనివల్ల మన జీవితంలో శాంతి, విజయాన్ని అందించగల శక్తివంతమైన ఆచారంగా భావిస్తారు. ఈ విధంగా చేయడం శ్రీ కృష్ణుని అనుగ్రహంతో జీవిత మార్పులు వస్తాయని నమ్మకం.

ముఖ్యమైన శ్రావణ మాసం శివ శ్లోకాలు

శివునికి ఏమి సమర్పించాలి?

కృష్ణాష్టమి వ్రతం పూర్తి పద్ధతి – దశలవారీ మార్గదర్శకం

దశ 1: ఉపవాసానికి ముందైన ఏర్పాట్లు

కృష్ణాష్టమి రోజున భక్తులు ఉపవాసం ఉండే ముందు ముఖ్యంగా శరీర శుద్ధి కోసం తులసి పత్రం కలిగిన నీటితో స్నానం చేయాలి. పూజ చేసే సమయంలో అవసరమైన వస్తువులు ముందుగా సిద్ధం చేసుకోవాలి – ఇందులో ముఖ్యంగా దీపాలు, కలశం, వెన్న, తులసి, మకరందం, పాలు, పంచామృతం, పూలు, నైవేద్యాలు మొదలైనవి. పూజా చేసే గది మాత్రం చాల శుభ్రంగా ఉండాలి. పూజ చేసే స్థలంలో చిన్న కృష్ణుడి విగ్రహాన్ని (లేదా ఫొటోను) భకి శద్ధతో పచ్చని ఆకులతో, పుష్పాలతో అలంకరించాలి. 

దశ 2: రాత్రి 12 గంటల పూజ విధానం

ఈ రోజు రాత్రి 12 గంటల సమయంలో శ్రీకృష్ణుడి జన్మ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ పూజను ప్రారంభించాలి. ఈ సమయంలో గణపతి పూజతో మొదలుపెట్టి, అనంతరం శ్రీ కృష్ణుడికి అభిషేకం చేయాలి. పంచామృతంతో అభిషేకించిన తర్వాత శుభ్రమైన ప్రతి వస్త్రాలు అలంకరించి, భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు కృష్ణుడికి సమర్పించాలి. భకి తో దీపారాధన చేసి, శ్లోకాలు చదవాలి. ఈ పవిత్రమైన సమయంలో “శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు” తెలుపుతూ కుటుంబ సభ్యులంతా ప్రార్థన చేయడం శుభం. 

దశ 3: శ్లోకాలు, నైవేద్యాలు, కోలాటాలు మరియు ముగింపు కార్యక్రమాలు

ఈ పూజ అనంతరం “ఓం నమో భగవతే వాసుదేవాయ”, “గోవిందా గోపాలా” వంటి ముఖ్యమైన భక్తి శ్లోకాలు ఉచ్చరించడం మంచిది . మరి కొంత భక్తులు కోలాటాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో పిల్లలకు ఉరియడల వంటి ఆటలు నిర్వహిస్తారు. పూజ సమయంలో దేవునికి నైవేద్యంగా వెన్న, పెరుగు అన్నం, చక్కెర పొంగలి వంటివి సమర్పించడం ఉత్తమం. చివరగా మనము భక్తులందరికి ప్రసాదం పంచి, పూజను ముగించాలి.


కృష్ణాష్టమి రోజున ఏమి చేయాలి – ఏం చేయకూడదో తెలుసుకోండి

శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది భక్తి, నిష్ఠతో కూడిన పవిత్రమైన పండుగ బావిచబడింది. ఈ రోజు ముఖ్యంగా భక్తులు ఉపవాసం చేసి, కృష్ణుడికి భకి శుద్ధతో పూజలు చేస్తారు. అయితే ఈ పవిత్ర దినంలో కొన్ని నియమాలను పాటించడం అవసరం. ఈ సమయంలో శుద్ధత, భక్తి, మరియు ఆచారాలను గౌరవిస్తూ, కొన్ని పనులను తప్పించుకోవడం ఉంచాల్సినవిగా భావిస్తారు.

చేయకూడని పనులు:

1.ఈ రోజున మాంసాహార సేవనాన్ని పూర్తిగా నివారించాలి. ఈ రోజు శాకాహారమే మాత్రమే పాటించాలి, ఎందుకంటే శాకాహారం శుద్ధిని సూచిస్తుంది.

2.ఈ రోజున తులసి ఆకులు కోయకూడదు. తులసి దేవిగా భావిస్తారు. కృష్ణాష్టమి నాడు వాటిని ముందుగానే కోసి నిల్వ చేసుకొని ఉంచుకోవాలి. 

3.ఈ పవిత్రమైన సమయంలో చెట్లు కోయడం, లేదా కొత్త పనులు ప్రారంభించడం అసలు మంచిదికాదు. 

4.భక్తులు అహంకారం, కోపం, అసత్యం వంటి నెగటివ్ భావాలను పూర్తిగా నివారించాలి. ఈ రోజు మన మనస్సు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.


చేయాల్సిన ముఖ్యమైన పనులు:

1.ఉపవాసం ద్వారా శరీరం శుద్ధితో పాటు మన మనస్సు శుద్ధి కూడా ఇస్తుంది.

2.భక్తులు భక్తి శుద్ధ తో పూజ చేయాలి. ఈ రోజు అర్థరాత్రి 12 గంటల సమయంలో పూజ చేసి, కృష్ణుని అవతారాన్ని స్మరించాలి.

3.ఈ సమయంలో భజనలు, శ్లోకాలు పాటించడం అవసరం. “ఓం నమో భగవతే వాసుదేవాయ” వంటి మంత్రాలను పఠించడం శుభంగా భావిస్తారు.

4.భక్తులు ప్రేమ, క్షమ, సహనాలతో జీవించాలి. ఈ రోజు మనం శ్రీకృష్ణుడు ఇచ్చిన నీతులను గుర్తుంచుకుని నడవడం ముఖ్యం.  

5.ముఖ్యంగా పిల్లలతో ఉత్సాహంగా వేడుకలు వేషధారణ, ఉరియడల వంటి ఆటలు ఈ పండుగలోవాలా ఆనందాన్నిపెంచుతాయి.

ఈ విధంగా మనం కృష్ణాష్టమి రోజు కొన్ని ఆచారాలను పాటించి, మరి కొని విషయాలను దూరంగా ఉంచితే కృష్ణాష్టమి పండుగ మరింత పవిత్రంగా మారుతుంది.


మూల ముగింపు: కృష్ణాష్టమి వ్రత సారాంశం

శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం అనేది హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగలో ఒకటి. ఈ రోజు భక్తులు ఉపవాసం, పూజలు, భజనలు ద్వారా మరింత బలంగా అభివృద్ధి చేసుకుంటారు. మనం కృష్ణుడి జన్మ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఆయన జీవితం, లీలలు, ధర్మ బోధలను మన జీవితంలోకి తీసుకురావడమే ఈ వ్రతం యొక్క మూయమైన ఉద్దేశం గా భావిస్తారు. ఈ వ్రతాన్ని మనం ఆచరించడం ద్వారా మనం శరీర శుద్ధి, మనస్సు , మరియు ఆత్మానందాన్ని పొందగలుగుతాం అని నమ్మకం. ఈ విలువలను అనుసరిస్తూ మనం జీవితాన్ని సాగించాలన్న సంకల్పాన్ని ఈ పండుగ ద్వారా మళ్లీ గుర్తు చేసుకుంటాం అని భావిస్తారు. ముఖ్యంగా చిన్నారుల వేషధారణ, ఉరియడల ఆటలు, కోలాటాలతో కూడిన ఈ రోజున వేడుకలు కుటుంబంలో ఆనందాన్ని పంచుతాయి. భక్తులు ఈ పూజా పద్ధతులు, నైవేద్యాలు, శ్లోకాలతో కూడిన ఈ వ్రతాన్ని ఆచరించడం జీవితాల్లో శాంతి, సుఖం మరియు ప్రగతి నెలకొంటుంది.

లక్ష్మీ పూజ కోసం అవసరమైన సామాగ్రి వివరాలు

ఇంట్లో శుక్రవారం లక్ష్మీ పూజ ఎలా చేయాలి?

కృష్ణాష్టమి రోజున ఉపవాసం ఎప్పుడు ప్రారంభించాలి?

ఈ పవిత్రమైన కృష్ణాష్టమి రోజున మనం ఉపవాసం అష్టమి తిథి ప్రారంభమైన వెంటనే పరంభించుకోవాలే ఉపవాసం చేసే ముందు శుభ్రంగా తలా స్నానం చేసి, శుద్ధమైన వస్త్రాలు ధరించాలి ముఖ్యం. ఈరొజు రాత్రి శ్రీకృష్ణుని జన్మ సమయంలో పూజ చేసిన తర్వాత  ఉపవాసాన్ని విరమించాలి. ఈ రోజున ఉపవాసం రాత్రి 12 గంటల సమయంలో శ్రీకృష్ణ జన్మోత్సవ పూజ అనంతరం ముగించుకోవాలి.  మనం ఈలాచేయడం వలన మన శరీర, మనస్సు శుద్ధికి పవిత్ర చర్యగా భావించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున భక్తులు నిష్ఠగా ఉపవాసం చేస్తే భక్తులు పుణ్యం లభిస్తుందని నమ్మకం.

కృష్ణాష్టమి పూజకు ఏ సామగ్రి కావాలి?

ఈ పూజ కోసం మూయమైన సామాగ్రి వెన్న, తులసి దళం, పంచామృతం, పాలు, మకరందం వంటి  పదార్థాలు అవసరం. శ్రీకృష్ణుడి విగ్రహం లేదా చిత్రానికి పూలతో అలంకరణ చేయడం ముఖ్యం. దీపారాధన మరియు నైవేద్యం కోసం నూనె దీపాలు, భక్తి శ్రద్ధతో తయారుచేసిన ప్రసాదాలు సిద్ధం చేయాలి.

కృష్ణాష్టమి పూజను ఇంట్లో ఎలా చేయాలి?

ముందుగా ఉదయం లేచి శరీర శుద్ధి కోసం తలా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.ముఖ్యంగా పూజ స్థలాన్ని శుభ్రం చేసి, కృష్ణుని బొమ్మను లేదా ఫోటో పుష్పాలతో అలంకరించాలి.పంచామృత అభిషేకం చేసాక, వెన్న, తులసితో నైవేద్యం సమర్పించాలి.భక్తులు భక్తితో శ్లోకాలు, భజనలు పఠించాలి. ఈ రోజున రాత్రి పూట 12 గంటలకు జన్మాష్టమి ఉత్సవంగా జరుపుకోవడం శుభం.

శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలు సమర్పించాలి?

ముందుగా భక్తులు కృష్ణునికి నైవేద్యంగా వెన్న, పెరుగు అన్నం,  పాలు మరియు లడ్డూ వంటివి  సమర్పిస్తారు.ఈ రోజున శ్రీకృష్ణుడికి వెన్న, పెరుగు అన్నం, మరియు లడ్డూ వంటి మిఠాయిలు శ్రీకృష్ణుని నైవేద్యంగా సమర్పించబడతాయి.

కృష్ణాష్టమి రోజున తులసి ఆకులు ఎందుకు కోయరాదు?

ఈ పవిత్రమైన కృష్ణాష్టమి రోజున తులసి ఆకులు కోయరాదు, ఎందుకంటే ఈ రోజు తులసి దేవి విశ్రాంతి తీసుకుంటుందనే ఆచారం పురాణాల్లో ఉంది. ఇదువలన ఈ రోజు ఆమెకు విశ్రాంతిని ఇవ్వడం శ్రేయస్కరం అనేది హిందూ సంప్రదాయం నమ్మకం. 

చిన్న పిల్లల కోసం కృష్ణాష్టమి వేడుకలు ఎలా చేయాలి?

ఈ రోజున స్కూల్ లేదా ఇంట్లో చిన్న స్టేజ్ ఏర్పాటుచేసి, పిల్లలతో శ్రీకృష్ణుడు పాత్రలు పోషించించి, చిన్న పాటలతో పాటు ఉరియడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సమయంలో పిల్లల కోసం కృష్ణాష్టమిని ప్రత్యేకంగా జరుపాలంటే, వేషధారణ, ఉరియడ, భక్తిగీతాలు, చిన్న చిన్న నాటికలతో వేడుకలకి వేడుకలు నిర్వహించవచ్చు.

కృష్ణాష్టమి రోజున ఎలాంటి పనులు చేయరాదు?

కృష్ణాష్టమి రోజున మనము మాంసాహారం తీసుకోవడం, అసత్యంగా మాట్లాడడం, మరియు తులసి ఆకులు కోయడం వంటి పనులు  శుభం కాదని గ్రంథాలు చెబుతున్నాయి. ఇవి పనులు పవిత్రతకు భంగం కలిగిస్తాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున కోపం, కలహం, అసభ్య వాక్యాలు, తప్పక నివారించాలి. ఈ రోజున మనం దీన్ని శ్రద్ధగా గడపడం వల్ల పుణ్యం కలుగుతుంది.

కృష్ణాష్టమి కోసం శ్లోకాలు ఏవీ?

కృష్ణాష్టమి రోజున పఠించాల్సిన ముఖ్య శ్లోకాలు:
1. “వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥”
2. “గోవిందాయ నమో నమః”, “హరే రామ హరే కృష్ణ” వంటి మంత్రాలు,
3. “జయ జయ గోపాల”, “హే గోవింద హే గోపాల” వంటి భక్తి గీతాలు పాడవచ్చు.

కృష్ణాష్టమి పూజ ఎన్ని గంటల పాటు చేయాలి?

1. కృష్ణాష్టమి రోజున పూజను సాయంత్రం ప్రారంభించి, అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించాలి, ఎందుకంటే ఈ సమయంలో శ్రీకృష్ణుడి అవతారము జరిగింది.
2. ఈ పవిత్ర పూజకు సుమారు 4–6 గంటల సమయం కేటాయించి, అభిషేకం, నైవేద్యం, మరియు హారతులతో ముగించటం ఆచారంగా ఉంటుంది అని భావిస్తారు. 
3. శ్రీ కృష్ణుని జన్మ సమయం అర్ధరాత్రి కావడంతో, పూజను రాత్రి 12 గంటల వరకు జరపడం శ్రేష్ఠంగా భావిస్తారు. ఈ సమయంలో మనం శ్లోకాలు, కీర్తనలు, ప్రసాదంతో పూజ ముగించాలి.

కృష్ణాష్టమి రోజున పిల్లలు కృష్ణ వేషధారణ ఎలా చేయాలి?

ఈ రోజున పిల్లలకు కృష్ణుడి వేషధారణలో పసుపు రంగు వస్త్రాలు, చేతిలో మురళి, తలపై నెమలి పింఛం ఉండాలి. తులసి మాల వేసి, కొద్దిగా మేకప్ చేసుకోవచ్చు. 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *