శుక్రవారం లక్ష్మీ పూజ – Traditional Lakshmi Puja at Home on Friday

శుక్రవారం లక్ష్మీ పూజా విధానం ఇంట్లో – Step by Step పూర్తి గైడ్

హిందూ సంప్రదాయంలో శుక్రవారం రోజున మహా లక్ష్మీదేవిని పూజించడం ఎంతో శుభ ఫలితాలను ఇచ్చే పవిత్రమైన దినంగా భావిస్తారు. ముఖ్యంగా మనం గమనించినట్టు అయితే వివాహిత మహిళలు ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం  సిరి, సంపద, మరియు శాంతి మరియు సౌభాగ్యం నిలకడగా ఉంటాయని  భావిస్తారు. కానీ ఈ పూజను సరైన విధంగా చేయడం అవసరం దీని వల్ల ఫలితాలు విశేషంగా ఉంటాయని నమ్మకం. 

గృహిణులు పూజకు చేసే ముందు ఉదయం స్నానం చేసి పూజా స్థలాన్ని శుభ్రపరచి, అవసరమైన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పూజ చేసే ఒక రోజు ముందే సామాగ్రిని తెచ్చిపెట్టుకోవడం మంచిది. అమ్మవారి విగ్రహాన్ని లేదా లక్ష్మీదేవి చిత్రాన్ని అలంకరించి, పసుపు, కుంకుమ, పూలతో భక్తి శ్రద్ధతో పూజ చేయాలి. పూజ చేసే సమయంలో ముఖ్యంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకధారా స్తోత్రం వంటి మంత్రాలు పఠించడం వలన శుభం కలుగుతుంది. ఇంట్లో శుక్రవారం లక్ష్మీ పూజను step by step గా ఎలా చేయాలో పూర్తిగా వివరించాము. పూజ కోసం కావలసిన ముఖ్యమైన సామాగ్రి నుండి హారతిదాకా ప్రతీ దశను తెలుగులో చక్కగా అర్థమయ్యేలా ఇవ్వడం జరిగింది. 

వరలక్ష్మీ వ్రతం పూజ విధానం, నియమాలు, సామాగ్రి – పూర్తి గైడ్

వ్రతాలు మరియు పండుగలు – శ్రావణ మాస ప్రత్యేకత

శుక్రవారం లక్ష్మీ పూజా విధానం ఇంట్లో 

హిందూ సంప్రదాయ ప్రకారం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో శాంతి, ధనం, మరియు సౌభాగ్యం కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజున ప్రతి గృహిణి ఇంట్లో ఈ పూజను చేయడం శుభమని భావిస్తారు. పూజలు చేసే ముందు సరైన నియమాలను పాటిస్తే పూజ ఫలితాలు మరింత అనుకూలంగా ఉంటాయని విశ్వాసం. 

పూజకు ముందు తయారీ: ఈ రోజున అనగా శుక్రవారం ఉదయం స్నానం చేసి, ఇంటిని మరియు పూజాస్థలిని శుభ్రం చేసుకోవాలి. ఈ పూజకు పయోగించాల్సిన సామాగ్రిని ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవడం అవసరం. సామాగ్రి అనగా పసుపు, కుంకుమ, పాలు, పళ్ళు, పూలు, దీపం, పంచామృతం, నైవేద్యం మొదలైన సిద్ధం ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 

పూజా స్థలాన్ని సిద్ధం చేయడం: లక్ష్మీదేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రంగా పట్టు వస్త్రాలు మరియు పూలతో ఆమెను అలంకరించాలి. కలశంలో తులసి ఆకులు లేదా కొబ్బరి తప్పనిసరిగా ఉంచాలి.

పూజా దశలు:

1. గణపతి పూజతో ప్రారంభం
2. లక్ష్మీదేవికి పూలు, పసుపు, కుంకుమ
3. దీపం వెలిగించి, నైవేద్యం సమర్పించాలి
4. కనకధారా స్తోత్రం, అష్టోత్తర పఠన చేయాలి మరియు హారతి

ఈ పూజ అనంతరం ఇంటి సభ్యులతో నైవేద్యం పంచుకోవడం ద్వారా సంపూర్ణత అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుంది.

లక్ష్మీ పూజ కోసం అవసరమైన సామాగ్రి వివరాలు

భక్తులు శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజను పూర్తి భక్తి శ్రద్ధతో చేయాలంటే ఒకరోజు ముందుగా కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం. పూజ సమయంలో భక్తులు చివరి నిమిషంలో ఏం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కింద ఇచ్చిన వాటిని పూజకు ముందు రోజు సిద్దం చేసుకోవడం ముఖ్యమైన పని.

పూజా సామాగ్రి జాబితా:

హారతి పళ్లెం, ప్లేట్‌ మీద నైవేద్యం
పసుపు, కుంకుమ, చందనం
పూలు – ముఖ్యంగా జాజిపూలు, తులసి పత్రం (తాజా పూలు ఉత్తమం)
దీపం – నెయ్యి లేదా నూనెతో
పంచామృతం – పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెరతో చేసుకోవాలినైవేద్యం – లడ్డు లేదా శుద్ధమైన స్వీట్లు
పళ్ళు – ద్రాక్ష, అరటి, జామ వంటి పండ్లు అవసరం
లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం
కలశం – నీటితో నింపి, తులసి ఆకుతో అలంకరించాలి కర్పూరం, గంట, అగ్రబత్తీ.

మూల ముగింపు:  ఈ వ్యాసంలో ఇంట్లో శుక్రవారం లక్ష్మీ పూజను ఎలా చేయాలో స్పష్టంగా మరియు సులభంగా  మనం తెలుసుకున్నాం. మన భారతీయ సంప్రదాయంలో శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం ఎంతో విశిష్టత కలిగిన పని.   పూజ కోసం తెచ్చుకోవాల్సిన సామాగ్రిని పూజా స్థల ఏర్పాట్లు, మంత్రాల పఠనం, నైవేద్యం వరకు ప్రతిదీ క్లియర్‌గా చెప్పబడింది. ఈ పవిత్రమైన రోజున పూజ చేసినవారికి ధనం, ధాన్యం, ఐశ్వర్యం, శాంతి అన్నీలభిస్తాయని నమ్మకం.

మనము ఈ పూజను ప్రతి శుక్రవారం ఆచరించాలనుకుంటే, పైన ఇచ్చిన step-by-step గైడ్ మనకు ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది.  ముఖ్యంగా ఇంట్లోనే శుక్రవారం రోజు వ్రతంగా ఉన్నప్పుడు పూజ యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.  పై చెప్పిన ఆచారాలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం, సిరిసంపద వృద్ధి మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు. ప్రతి భక్తుడు ఈ విధంగా  భక్తి శ్రద్ధతో చేసిన పూజ మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వాసిస్తారు. 

హనుమాన్ చాలీసా పఠనం ఎలా చేయాలి? మంత్ర ఫలితాలు మరియు శుభ సమయం

శ్రావణ మాసం 2025: శివుడికి శ్రేష్ఠమైన పూజ సమయం

శుక్రవారం లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి?

మంచిగా ఫలితాలు రావాలంటే శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా సాయంత్రం దీపారాధన సమయంలో పూజ చేయడం శుభంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో మన మనసుని.ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పూజా మనకు ఫలితాలు ఇస్తోంది.

ఇంట్లో శుక్రవారం లక్ష్మీ పూజ ఎలా చేయాలి?

ముందుగా మనం శుక్రవారం రోజున ఉదయం లేచి తలస్నానం చేశాక ఇంటిని శుభ్రంగా చేసుకుని పూజాస్థలాన్ని సిద్దం చేసుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని పసుపు, కుంకుమ, పూలతో,తులసి, అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. పూజ చేసే సమయంలో నకధారా స్తోత్రం, అష్టోత్తర శతనామావళి పఠించడం మరియు నైవేద్యం సమర్పించడం చేసిన పూజ ఫలితాన్ని పెంచుతుంది.

లక్ష్మీదేవికి ఏ నైవేద్యం సమర్పించాలి?

లక్ష్మీదేవి నైవేద్యానికి అరటి, ద్రాక్ష వంటి పండ్లను మరియు పాలు, పంచామృతం వంటి నైవేద్యాలు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఒకవేళ మనకు వీలు కాకపోతే ప్రేమతో సమర్పించినది ఏదైనా అమ్మవారికి ఇష్టం. భక్తి శ్రద్ధలతో ఆమెకు సమర్పించడమే ముఖ్యమైనది.

శుక్రవారం లక్ష్మీ పూజ కోసం ఏ మంత్రాలు పఠించాలి?

శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పఠించాల్సిన ముఖ్యమైన మంత్రాల్లో ‘ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః’, కనకధారా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పవిత్రమైనది భక్తులు భావిస్తారు. ఇవి చేయడం వల్ల శుభ ఫలితాలను లభిస్తాయి అని నమ్మకం.పై చెప్పిన మంత్రాలు పూర్తి జ్ఞానంతో చేయాల్సి ఉంటుంది.

శుక్రవారం ఉపవాసం లక్ష్మీదేవికి చేయచ్చా?

అవును, శుక్రవారం ఉపవాసం చేయడం చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఇది శుభకార్యంగా భావిస్తారు. ఉపవాసం ఉండేటప్పుడు ఉపవాసం ఏదైనా ఫలహారం తీసుకోవచ్చు. సాయంత్రం సమయంలో పూజా కార్యక్రమం అనంతరం భోజనం చేయాలి.

పూజకు కావలసిన సామాగ్రిని ముందే సిద్ధం చేయాలా?

అవును, పూజ సమయంలో గందరగోళం కాకుండా  ఉండాలంటే ఒక రోజు ముందు పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోవడం చాలా మంచిది. ఇందువల్ల పూజ చేసే సమయంలో ఏదైనా మిస్ కాకుండా ఉంటుంది.ఇందులో ముఖ్యంగా పూలు, నైవేద్యం, దీపాలు సిద్ధం చేసుకోవడం అవసరం. పూజ శ్రద్ధగా, భక్తిగా చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.

శుక్రవారం లక్ష్మీ పూజలో దీపం ఎలా వేయాలి?

శుక్రవారం లక్ష్మీపూజలో నెయ్యితో లేదా నూనెతో దీపం వెలిగించవచ్చు. దీపం వెలిగించిన తర్వాత అమ్మవారిని భక్తితో ధ్యానించాలి. దీపారాధన అమ్మవారి పూజలో ఒక పవిత్రమైన భాగం.

 పూజ తర్వాత ఏం చేయాలి?

ఆ తర్వాత అమ్మవారికి మరియు కుటుంబ సభ్యులకు హారతి ఇచ్చి, నైవేద్యాన్ని అందరికి పంచుకోవాలి.  చివరగా అమ్మవారిని శ్రద్ధతో మనసారా ధ్యానించి కృతజ్ఞతలు తెలియజేయడం పూజకి సంపూర్ణత ఇస్తుంది.


Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *